Fixed Deposit: ఎఫ్‌డీ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై రూ.3 కోట్ల వరకు రిటైల్‌ డిపాజిట్టే

Fixed Deposit: బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నిర్వచనాన్ని సవరించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. రూ.3 కోట్ల వరకు చేసే డిపాజిట్లను రిటైల్‌ ఎఫ్‌డీలుగానే పరిగణించనున్నట్లు తెలిపింది. 

Published : 07 Jun 2024 12:39 IST

Fixed Deposit | ముంబయి: బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Bulk Fixed Deposit) నిర్వచనాన్ని సవరించాలని ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)’ ప్రతిపాదించింది. రూ.3 కోట్లు ఆపై చేసే మొత్తాన్ని ఈ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలకు త్వరలోనే జారీ చేస్తామని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం రూ.రెండు కోట్లు ఆపైన చేసే మొత్తాన్ని బల్క్‌ డిపాజిట్‌గా (Bulk Fixed Deposit) పరిగణిస్తున్నారు.

ఇకపై రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను (Fixed Deposit) సైతం రిటైల్‌ ఎఫ్‌డీగానే లెక్కలోకి తీసుకుంటారు. సాధారణంగా బ్యాంకులు రిటైల్‌తో పోలిస్తే బల్క్‌ ఎఫ్‌డీలపై తక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంటాయి. తాజా నిర్ణయం ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి శుభవార్తనే చెప్పాలి. గతంతో పోలిస్తే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ లభించనుంది. కొన్ని బ్యాంకులు కాల వ్యవధిని బట్టి బల్క్‌ డిపాజిట్లపై కూడా ఆకర్షణీయమైన వడ్డీరేటును అందిస్తున్నాయి. కొత్త మార్పు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు వర్తించనున్నాయి. మరోవైపు ‘రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల (RRB)’ విషయంలో రిటైల్‌ డిపాజిట్ల పరిమితి రూ.కోటికి పెంచారు. ఆర్‌ఆర్‌బీల్లో రూ.1 కోటి, ఆపై మొత్తాన్ని బల్క్‌ ఎఫ్‌డీ పరిగణిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు