SBI- CBDC: యూపీఐ ద్వారా ఇ-రూపీ.. SBI కస్టమర్లకు అందుబాటులోకి

SBI: ఎస్‌బీఐ తన డిజిటల్‌ రూపీ యాప్‌లో యూపీఐ ఇంటర్‌-ఆపరేబిలిటీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి వ్యక్తులు డిజిటల్‌ రూపాయిలను పంపించుకోవచ్చు.

Updated : 04 Sep 2023 14:23 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) డిజిటల్‌ రూపాయికి సంబంధించి కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి డిజిటల్‌ రూపీని (CBDC) పేమెంట్‌కు వినియోగించేకునే వీలుగా యూపీఐ ఇంటర్‌-ఆపరేబిలిటీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే ఎస్‌బీఐ ఇ-రూపీ (e-Rupee) యాప్‌ వాడుతున్న వారు ఇకపై యూపీఐ స్కాన్‌ చేసి లావాదేవీలు పూర్తి చేయొచ్చని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

గతంలో ప్రైవేటు రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తొలుత ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత కెనరా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌ సైతం ఇంటర్‌-ఆపరేబిలిటీ ఫీచర్‌ను తీసుకొచ్చాయి. ఇప్పుడు ఎస్‌బీఐ ఆ జాబితాలో చేరింది. దీనివల్ల యూపీఐ లావాదేవీల కోసం క్యూఆర్‌ కోడ్‌లను వినియోగిస్తున్న వ్యాపారులు.. తమ రోజువారీ వ్యాపార లావాదేవీల్లో ఇకపై డిజిటల్‌ రూపాయిని సైతం వినియోగించుకోవడానికి వీలు పడుతుంది.

LIC: మీ పాలసీ ల్యాప్స్‌ అయ్యిందా? పునరుద్ధరణకు ఎల్‌ఐసీ అవకాశం!

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీగా పేర్కొనే ఇ-రూపీ పైలట్‌ ప్రాజెక్ట్‌ను ఆర్‌బీఐ గతేడాది ప్రారంభించింది. తొలుత హోల్‌సేల్‌ విభాగంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. తర్వాత రెగ్యులర్‌ లావాదేవీల కోసం రిటైల్‌ యూజర్ల కోసం పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్ ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కస్టమర్లను బ్యాంకులు ఇన్వైట్‌ చేస్తున్నాయి. వారు మొబైల్‌ అప్లికేషన్‌ను ఉపయోగించుకుని ఇ-రూపీని వినియోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని