ద్విచక్ర వాహన రుణం Vs వ్యక్తిగత రుణం వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకులు ద్విచక్ర వాహనాల రుణాలపై, వ్యక్తిగతంగా తీసుకునే రుణాలపై ఎంతెంత వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయో ఇక్కడ ఉంది.

Published : 26 May 2023 15:00 IST

ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పెరిగాయి. వీటి కొనుగోళ్లకు బ్యాంకులు కూడా వేగంగానే రుణాలిస్తున్నాయి. అదే విధంగా వ్యక్తిగత రుణాలను కూడా బ్యాంకులు వేగంగా మంజూరు చేస్తున్నాయి. అయితే, ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేటప్పుడు వాహన రుణంతో కొనుగోలు చేయాలా? లేదా వ్యక్తిగత రుణాన్ని తీసుకుని కొనుగోలు చేయాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అలాగే, వాహన రుణం తీసుకుని చెల్లించలేనప్పుడు బ్యాంకుకు వాహనాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుందని గమనించాలి. వ్యక్తిగత రుణం విషయంలో క్రెడిట్ స్కోరు మాత్రమే దెబ్బ తింటుంది. వాహనాన్ని స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకుకు ఉండదు. రుణాన్ని ఎంచుకోవడం అనేది మీ నిర్దిష్ట అవసరాలు, ఛార్జీలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు, ఇతర ఛార్జీలలో పెద్దగా తేడా లేనప్పుడు వ్యక్తిగత రుణం ఎంచుకోవడం మేలు.

ద్విచక్ర వాహన రుణం, వ్యక్తిగత రుణంపై వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఈ కింది పట్టికలో చూడండి.

గమనిక: పైన తెలిపిన పట్టికలో బ్యాంకులు ప్రకటించిన అత్యల్ప వడ్డీ రేట్లు మాత్రమే తెలిపాం. క్రెడిట్‌ స్కోరు, వృత్తి, వయసు ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులుండవచ్చు. వడ్డీ రేట్లలో ప్రాసెసింగ్‌ ఫీజులు కలపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని