Sundar Pichai: సుందర్‌ పిచాయ్‌ ‘బనానా’ పోస్ట్‌.. అర్థం ఇదేనా?

Eenadu icon
By Business News Team Published : 28 Aug 2025 00:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Sundar Pichai | ఇంటర్నెట్‌ డెస్క్: గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆయన తన ఎక్స్‌ ఖాతాలో మూడు అరటిపండ్ల ఎమోజీలను పోస్ట్‌ చేయడం తెగ వైరల్‌ అయ్యింది. దీంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది గూగుల్ నుంచి రానున్న కొత్త ఏఐ టూల్‌కు సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు.

సుందర్‌ పిచాయ్‌ చేసిన పోస్టు.. గూగుల్‌ ‘నానో బనానా’(Nano Banana) ఏఐ టూల్‌కు సంకేతమని ఎక్స్ఏఐ ప్లాట్‌ఫాం గ్రోక్‌ పేర్కొంది. ఇది ఫొటో ఎడిటింగ్‌, ఇమేజ్‌ జనరేషన్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జెమిని ఇమేజ్‌ జనరేషన్‌లో ఇప్పుడు బనానా అప్‌డేట్‌ వచ్చిందని గూగుల్ డీప్‌మైండ్‌  ప్రకటించింది. ఇది ఫొటో రియలిస్టిక్‌ మాస్టర్‌పీస్‌ల నుంచి ఫాంటసీ వరల్డ్‌ వరకు విజువల్స్‌ను సృష్టించగలదని పేర్కొంది.

ఏంటీ ‘నానో బనానా’?

ఇది గూగుల్‌లో అభివృద్ధి చెందుతున్న కొత్త జనరేటివ్‌ ఇమేజ్‌ టూల్‌ అని వదంతులు వస్తున్నాయి. text ద్వారా ఫొటోలో మార్పులు చేయడం దీని ప్రత్యేకత. ఒకటి రెండు సెకన్లలోనే ఎడిటింగ్‌ పూర్తి చేయగలదు. దీంతో ఫేషియల్ డీటెయిల్స్‌, లైటింగ్‌, స్టైల్ చెక్కుచెదరకుండా ఫొటోలో మార్పులు చేయొచ్చు. కొత్త ఫొటోను జనరేట్‌ చేయడం, మీ ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్‌ మార్చడం, వస్తువులను జోడించడం వంటి మార్పులు సులభంగా చేయొచ్చు.

ప్రస్తుతం ఇది పబ్లిక్‌కి అందుబాటులో లేదు. LMArenaలో బాటిల్‌ మోడ్, నానోబనానా.ఏఐతో పాటు Flux AI, Bylo.ai, and Dzine వంటి థర్డ్‌ పార్టీ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి. ఇటీవల LMArena లో ఈ టూల్‌ ఇతర AI మోడళ్లతో పోటీపడింది. తొలి విడత వినియోగదారులు దీని ఫొటోరియలిస్టిక్ అవుట్‌పుట్, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌, క్యారెక్టర్ రీస్టోరేషన్ సామర్థ్యాలను వినియోగదారులు ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు