Nagpur: బ్రిడ్జి పైనుంచి రైల్వేట్రాక్‌పై పడిన కారు.. తెలుగువారికి గాయాలు!

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది.  44వ నంబర్‌ హైవేపై వెళ్తున్న కారు అదుపు తప్పి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ నంబర్‌ 108)పైనుంచి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది.

Updated : 02 Jul 2023 12:03 IST

ఈటీవీ ఆదిలాబాద్‌: మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నంబర్‌ హైవేపై వెళ్తున్న కారు అదుపు తప్పి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ నంబర్‌ 108)పైనుంచి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటన నాగపుర్‌- ఇంగన్‌ఘాట్‌ మార్గంలోని బోర్‌ఖేడి సమీపంలో 796/16 పాయింట్‌ వద్ద చోటుచేసుకుంది. మొత్తం నాలుగు ట్రాక్‌లు ఉండగా.. 3, 4 ట్రాక్‌ల మధ్య కారు పడింది. ఈ ప్రమాదంలో అందులోని ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

ప్రమాదానికి గురైన కారు నంబర్‌ టీఎస్‌ 13 సిరీస్‌తో ప్రారంభమైంది. దీని బట్టి అది హైదరాబాద్‌కు చెందిన వాహనంగా తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి నాగపుర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గాయపడిన వారిని తెలుగువారిగా భావిస్తున్నారు.  స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు.. ఆ మార్గంలో అరగంట సేపు రైళ్లను నిలిపివేశారు. కారును పక్కకు తొలగించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని