బాలికలతో బలవంతంగా వ్యభిచారం

అంతర్‌ రాష్ట్ర వ్యభిచార రాకెట్‌తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్‌ప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 17 May 2024 03:45 IST

ఈటానగర్‌లో డీఎస్పీ సహా 21 మంది అరెస్ట్‌

ఈటానగర్‌: అంతర్‌ రాష్ట్ర వ్యభిచార రాకెట్‌తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్‌ప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. 10-15 ఏళ్లలోపు వయసున్న ఐదుగురు మైనర్లను రక్షించినట్లు బుధవారం వెల్లడించారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ), డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ కూడా ఉన్నారని తెలిపారు. ఈటానగర్‌లో బ్యూటీ పార్లర్‌ను నడుపుతున్న ఇద్దరు మహిళలు అస్సాంలోని ధేమాజీ నుంచి మైనర్లను అరుణాచల్‌ప్రదేశ్‌కు తీసుకొచ్చారని ఎస్పీ రోహిత్‌ రాజ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. చింపూలో మైనర్‌ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ మే 4న వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వరుస దాడులు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు బాధిత మైనర్లను రక్షించారు. ఉద్యోగాల పేరిట ధేమాజీ నుంచి తీసుకొచ్చిన తర్వాత తమను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టారని మైనర్లు వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషన్‌కు సమాచారం ఇచ్చారు. విచారణలో మరో ఇద్దరు మైనర్లు కూడా మహిళల అధీనంలో ఉన్నట్లు వెల్లడైంది. మరో బాలికను వేరే ప్రాంతానికి తరలించినట్లు గుర్తించారు. వీరందరినీ రక్షించి ప్రస్తుతానికి వసతి గృహానికి తరలించారు. వ్యభిచార గృహ నిర్వహణతో సంబంధం ఉన్న 10 మందిని, ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 11 మంది విటులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు