Updated : 29 May 2022 07:23 IST

Crime News: పెళ్లి రోజే.. రంపంతో కోసి భార్య, పిల్లలను చంపిన ఐటీ ఉద్యోగి

ఆపై ఆత్మహత్య 

అప్పుల భారం తట్టుకోలేకే దారుణం

చెన్నై (క్రైం), న్యూస్‌టుడే: అప్పుల భారంతో ఓ కుటుంబ పెద్ద తన పెళ్లిరోజే భార్య, పిల్లలను హత్య చేశాడు. రంపంతో భార్య, ఇద్దరు పిల్లల గొంతులు కోసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు చెన్నైలోని పల్లావరం వద్ద పొళిచ్చలూం్కి చెందిన ప్రకాశ్‌ (42) ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య గాయత్రి (39), కుమార్తె నిత్యశ్రీ (13), కుమారుడు హరికృష్ణన్(8) ఉన్నారు. గాయత్రి నాటు మందుల దుకాణం నడుపుతోంది. కొన్ని నెలలుగా ప్రకాశ్‌కు అప్పులు ఎక్కువయ్యాయి. ఈ కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రీ భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే ప్రకాశ్‌ తన ఇద్దరు పిల్లలు, భార్య గొంతులను రంపంతో కోసి చంపాడు. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఎంతసేపటికీ ఇంటి నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా దారుణం బయటపడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో గోడకు అతికించిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో ఉంది. సుమారు రూ.3.50 లక్షల విలువైన రుణ పత్రాలు గుర్తించారు. శుక్రవారం వారి పెళ్లి రోజని, ఇంతలో ఘోరం జరిగిందని బంధువులు విలపించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని