KTR: మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్‌

తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు

Published : 27 Apr 2024 10:47 IST

హైదరాబాద్‌: ‘తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. దీని ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ ఇది అన్నారు. ఈ నేల మేలు కోరేది భారాస అని పేర్కొన్నారు. చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించిన తీరును, లాఠీ దెబ్బలకు భయపడకుండా ముందుకు సాగిన కార్యకర్తల త్యాగనిరతిని కొనియాడారు. అనునిత్యం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని