logo

నేతకాని మహార్ల సమస్యలను పరిష్కరించాలి

నేతకాని మహార్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య కోరారు.

Published : 19 May 2024 16:46 IST

ఎదులాపురం: నేతకాని మహార్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య కోరారు. స్థానిక ఫ్రంట్ మీడియా ప్రెస్ క్లబ్‌లో ఆయన ఆదివారం మాట్లాడుతూ నేతకాని మహార్‌ల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితుల సమస్యలను పరిష్కరించాలని వారికి పహణిలు అందేలా ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర సమస్యలను సైతం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులను జిల్లా కార్యవర్గం శాలువాలతో సత్కరించింది. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర,  జిల్లా నాయకులు పలువురు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని