logo

తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..

నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్‌ అధికారులు అభిషేక్‌, భావన తెలిపారు.

Published : 19 Apr 2024 02:08 IST

నామినేషన్ల స్వీకరణకు ఎదురుచూస్తున్న ఐటీడీఏ పీఓ

పాడేరు, న్యూస్‌టుడే: నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్‌ అధికారులు అభిషేక్‌, భావన తెలిపారు. అరకు లోయకి సంబంధించి పాడేరు ఐటీడీఏ కార్యాలయం, పాడేరు అసెంబ్లీకి సంబంధించి జేసీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థితోపాటు నలుగురిని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తామని చెప్పారు.  

ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. రిటర్నింగ్‌ కేంద్రాల వద్ద వంద మీటర్ల దూరం వరకు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలకు అనుమతించడం లేదు.

రంపచోడవరంలో రెండు..

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం అసెంబ్లీ స్థానానికి స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం మొదటి రోజు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. రంపచోడవరం మండలం సిరిగిందలపాడు గ్రామానికి చెందిన పాలడుగు లక్ష్మీప్రసన్న, ఆమె తండ్రి పాలడుగు వెంకటేశ్వరరావు నామినేషన్లను దాఖలు చేసినట్లు ఆర్వో ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. తహసీల్దార్లు కృష్ణజ్యోతి, నాగరాజు, ఉప తహసీల్దార్లు సత్యనారాయణ, శివరామకృష్ణ, చైతన్య, విశ్వనాథం, సరిత, బాలాజీ, శ్రీధర్‌, రవీంద్రబాబు, వీరభద్రరావు, సీనియర్‌ సహాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని