logo

సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో ఆయుధ పూజ

దసరా ఉత్సవాల్లో మహర్నవమి సందర్భంగా సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో మంగళవారం ఉదయం పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా ఆయుధ పూజ చేశారు.

Published : 05 Oct 2022 01:49 IST

పూజలో పాల్గొన్న సీపీ కాంతిరాణాటాటా. చిత్రంలో వెంకటరత్నం, శ్రీనివాస్‌, ఉదయరాణి, చెంచిరెడ్డి

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : దసరా ఉత్సవాల్లో మహర్నవమి సందర్భంగా సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో మంగళవారం ఉదయం పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా ఆయుధ పూజ చేశారు. దసరా ఉత్సవాల్లో పోలీసులు ఆయుధ పూజ చేయటం ఆనవాయితీ. ఈ సందర్భంగా నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో, అన్ని విభాగాల్లో ఆయుధ పూజలు చేస్తారు. పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటాకు సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ అధికారులు, సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఆయుధాలకు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ సెక్యూరిటీ వింగ్‌ డీసీపీ ఉదయరాణి, ఇన్‌ఛార్జి అడ్మిన్‌ డీసీపీ పి.వెంకటరత్నం, పశ్చిమ ఇన్‌ఛార్జి డీసీపీ కొల్లి శ్రీనివాస్‌, హెడ్‌క్వార్టర్‌స ఏసీపీ చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు