logo

ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా

ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్‌ చంద్రక రోల్‌ అన్నారు.

Published : 20 Apr 2024 05:22 IST

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడువికాస్‌ చంద్ర కరోల్‌, ఆర్వో జేసీ గీతాంజలిశర్మ

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్‌ చంద్రక రోల్‌ అన్నారు. నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకులుగా నియమితులైన ఆయన శుక్రవారం స్థానిక రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. వసతులు, ఇతర ఏర్పాట్లను ఆర్వో జేసీ గీతాంజలి శర్మను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా 87126 93652 నంబరుకు సంప్రదించాలని పేర్కొన్నారు. తహసీల్దార్‌ పవన్‌కుమార్‌, డీటీ అరుణ్‌కుమార్‌, ఎన్నికల డీటీ గోపాల్‌రెడ్డి, ఆర్‌ఐ ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు