logo

చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా

సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకుని అంతర రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 22 Apr 2024 05:11 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకుని అంతర రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ నిమిత్తం నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు, ఉచితాలు తదితరాల అక్రమ  రవాణాకు అడ్డుకట్ట వేసేలా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద చెక్‌పోస్టును ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గరికపాడు, జొన్నలగడ్డ, ముక్త్యాల, గండ్రాయి, గంగినేనిపాలెం తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అధికారులు, సిబ్బందికి చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.3.25 కోట్ల నగదు, రూ.30.67 లక్షల విలువైన 5,999 లీటర్ల మద్యం, రూ.7.35 లక్షల విలువైన 1,38,658 గ్రాముల మత్తు పదార్థాలు, రూ.2.32 కోట్ల విలువైన 8 కిలోల లోహాలు.. వెరసి రూ.6.53 కోట్ల విలువైన వాటిని సీజ్‌ చేసినట్టు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని