logo

‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్‌ నిలబడినా ఓటమే’

కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ కోరారు.

Published : 19 Apr 2024 02:42 IST

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌
నేడు 8వ సారి నామినేషన్‌ దాఖలు

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, పాల్గొన్న ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, పీఏ మనోహర్‌

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ కోరారు. స్థానిక తెదేపా కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. అధినేత కుప్పం శాసన సభ స్థానానికి 8వ సారి పోటీ చేస్తున్నారన్నారు. ఈ దఫా లక్ష ఓట్ల ఆధిక్యం అధించేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కుప్పం అభివృద్ధికి 20 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు వివరించారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి శుక్రవారం ఒంటి గంటకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు లక్ష్మీపురంలోని శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో పూజలు చేసి.. కుప్పం చెరువుకట్ట నుంచి తెదేపా, జనసేన, భాజపా శ్రేణుల భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకుంటారని వివరించారు. సాయంత్రం 5 గంటలకు తెదేపా కార్యాలయంలో ప్రముఖులతో ముఖాముఖి, 20న అధినేత పుట్టిన రోజు సందర్భంగా కదిరిబండ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. తెదేపా కార్యాలయంలో ముస్లిం మహిళలతో ముఖాముఖిలో పాల్గొంటారన్నారు. ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ అన్న క్యాంటీన్‌లో అన్నదానం, మధ్యాహ్నం 2 గంటలకు సీనియర్‌ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతారని వివరించారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరుకు పయనమవుతారు. ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, పీఏ మనోహర్‌, సురేష్‌బాబు, రాజ్‌కుమార్‌, సత్యేంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని