logo

‘ఈ ఎన్నికల్లో గెలిచేది తెదేపా కూటమే’

రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని ఐ తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాలి గోపీనాథ్‌ పేర్కొన్నారు.

Published : 19 May 2024 01:10 IST

మాట్లాడుతున్న రాష్ట్ర ఐ తెదేపా కార్యదర్శి గాలి గోపీనాథ్‌

పుత్తూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని ఐ తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాలి గోపీనాథ్‌ పేర్కొన్నారు. పుత్తూరు తెదేపా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ ప్రజలు గత ఐదేళ్లుగా తాము అనుభవించిన కష్టాలు, కన్నీళ్లకు ఓట్ల రూపంలో ఓటర్లు బదులు తీర్చుకున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం విద్యుత్తు, బస్సు ఛార్జీలు పెంచి ప్రజలను మోసం చేసిందన్నారు. తెదేపా కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతుందన్నారు. నగరిలో తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ విజయం సాధించబోతున్నారని చెప్పారు. ఐ తెదేపా సభ్యులు సింగరాజు సతీష్, చంద్రశేఖర్‌రెడ్డి, ఈశ్వర్‌యాదవ్, యుగంధర్‌వర్మ, దేవినేని హరీష్, మహేష్, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని