logo

తీపెక్కిన మామిడి

బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులో మామిడి కాయల సీజన్‌ ప్రారంభమైంది.

Published : 19 May 2024 01:29 IST

ఆశాజనకంగా ధరలు

బంగారుపాళ్యం యార్డుకు  వచ్చిన మామిడి కాయలు

బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులో మామిడి కాయల సీజన్‌ ప్రారంభమైంది. మామిడి కాయల ధరలు ప్రస్తుతం కాసింత ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అంతంతమాత్రంగా పంట దిగుబడి వచ్చింది. టేబుల్‌ రకం కాయలు 10శాతమైనా దిగుబడి రాలేదు. కోసిన కాయలను రైతులు విక్రయించేందుకు బంగారుపాళ్యం మార్కెట్‌యార్డుకు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కాయలు కొనుగోలుకు రాకపోవడంతో మండీ వ్యాపారులే వచ్చిన కాయలు కొనుగోలు చేస్తున్నారు. పుల్లేరా రకం కాయలు నాణ్యతను బట్టి టన్ను రూ.25నుంచి 30వేలు, కాదర్‌ టన్ను రూ,.45 నుంచి రూ.50 వేలు పలికింది. గతేడాది గరిష్ఠంగా పుల్లేరా టన్ను రూ.10 నుంచి రూ.12 వేలకు మించలేదు. అదే కాదర్‌ రకం టన్ను రూ.20 నుంచి రూ.25 వేలకు మించి ధర  రాలేదు. ఈ ఏడాది రెట్టింపు ధరలు ఉన్నా దిగుబడి లేక.. పంట దిగుబడికి పెట్టిన సొమ్ము కూడా చేతికి రాలేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, బంగారుపాళ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని