logo

రూ.8.73 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం

ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Published : 20 Apr 2024 02:59 IST

వస్తువులను పరిశీలిస్తున్న అధికారులు

ధవళేశ్వరం: ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాటన్‌ బ్యారేజీ కూడలిలో తనిఖీలు చేస్తుండగా విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న కంటైనర్‌ వాహనాన్ని దక్షిణ మండల డీఎస్పీ అంబికాప్రసాద్‌, సీఐ వినయ్‌మోహన్‌ ఆపారు. ఏఈఆర్‌వో అప్పారావు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌ఛార్జి గోపాలరావు, ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారుల సమక్షంలో కంటైనర్‌ను తెరిపించి పరిశీలించగా 1.764 కిలోల బంగారం, 71.743 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.8.73 కోట్లుగా నిర్ధారించారు. రాజమహేంద్రవరంలోని నగల దుకాణాలకు వీటిని తరలిస్తున్నట్లు వాహన డ్రైవర్‌, సంబంధిత సిబ్బంది పోలీసులకు తెలిపారు. రవాణాకు అనుమతి పత్రాలు లేనందున నగలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకొని, రిటర్నింగ్‌ అధికారి, జేసీ తేజ్‌భరత్‌ ఆదేశాల మేరకు జిల్లా ట్రెజరీకి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని