logo

వెంకన్న కల్యాణం.. కల్యాణ క్రతువు

కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది.

Published : 20 Apr 2024 03:22 IST

నిర్వహిస్తున్న అర్చకులు 

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి ప్రధానాలయం నుంచి మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ తిరుచ్చి వాహనంపై కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి సింహాసనంపై ఆశీనులను చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనం మధ్య క్షేత్రపాలకుడు అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరస్వామి సాక్షిగా దేవదేవుని కల్యాణం అద్యంతం కమనీయంగా జరిగింది. విష్వక్షేనపూజ, రక్షాబంధనం, మదుపర్కప్రాశన, కన్యాదానం, మహాదాశీర్వచనం తదితర కార్యక్రమాలు పండితుడు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదచార్యులు నేతృత్వంలో రమణీయంగా జరిగాయి. కల్యాణమూర్తులకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ఆర్జేసీ, ఉత్సవ ప్రత్యేక అధికారి విజయరాజు, జిల్లా ఎండోమెంట్స్‌ అధికారి నాగమల్లేశ్వరరావు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్‌, ఈవో కిశోర్‌కుమార్‌, ఉమాసుందరి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.  

 స్వామివారి రథోత్సవం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని