logo

అట్టహాసంగా శ్రావణ్‌కుమార్‌ నామినేషన్‌

తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్‌ కుమార్‌ శుక్రవారం తాడికొండ ఆర్‌వో గంగరాజుకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు

Published : 20 Apr 2024 05:19 IST

ఆర్వోకు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణ్‌కుమార్‌, పక్కనే ఎంపీˆ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తదితరులు
తాడికొండ, న్యూస్‌టుడే: తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్‌ కుమార్‌ శుక్రవారం తాడికొండ ఆర్‌వో గంగరాజుకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.  గుంటూరు నుంచి భారీ ర్యాలీగా కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎంపీˆ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, జనసేన, భాజపా నాయకులతో కలిసి నామపత్రాలు సమర్పించారు. తొలుత గుంటూరు కార్యాలయం నుంచి స్థానిక అడ్డరోడ్డుకు చేరుకున్న నేతలకు అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలుగు యువత ద్విచక్రవాహనాలపై సందడి చేశారు. ప్రచార వాహనంపై ప్రజలకు అభివాదం చేసుకుంటూ నేతలు కార్యాలయానికి చేరారు. తొలుత లాం గ్రామంలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ గత అయిదేళ్లలో రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారన్నారు. యువతకు ఉపాధి లేకుండా చేశారని, మే 13వ తేదీతో రాష్ట్రానికి వైకాపా నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు. నియోజకవర్గానికి కనీసం తాగునీరు అందించలేని స్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రజల స్పందన చూస్తోంటే వైకాపాకు రోజులు దగ్గర పడ్డాయని స్పష్టమవుతోందని, కూటమి ప్రభంజనంలో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్నారు.  నాయకులు గాదే వెంకటేశ్వరరావు, వై.వి ఆంజనేయులు, కంతేటి బ్రహ్మయ్య, కంచెర్ల శివరామయ్య, కత్తెర సురేష్‌ కుమార్‌, జిల్లా జడ్పీ ఛైర్మన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, రాజధాని మహిళలు, రైతులు పాల్గొని మద్దతు తెలిపారు.

 ర్యాలీలో జన సందోహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు