logo

స్పందించేందుకు ఇప్పుడు సమయం దొరికిందా..?

రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Published : 23 Apr 2024 06:00 IST

ధ్వంసమైన అమరావతి నమూనాలు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల నియామాళి అమల్లో ఉన్న సమయంలోనూ సీఆర్డీఏ అధికారులు వైకాపా స్వామి భక్తిని వీడటం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఈ నెల 18న ‘అమరావతిపై ఇంత కక్షా..?’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై తమ ఇంజినీరింగ్‌ అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తోందని, శంకుస్థాపన ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను నియమించి నమూనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తీరిగ్గా అధికారులు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నాయకుల మాదిరిగా ఇంకా చేస్తాం.. చూస్తాం అంటారే గానీ.. మీడియా ఎదుట పనులు చేసి చూపటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో అక్రమార్కులు రోడ్లు తవ్వి మట్టి, కంకర, గ్రావెల్‌ను దోచుకుపోతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుతారోనని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు