logo

గాలి నుంచి నీటి ఉత్పత్తి

సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే ఏడబ్ల్యూజీ(అట్మాస్ఫియర్‌ వాటర్‌ జనరేటర్‌) యంత్రాలను తయారు చేశారు. ఇలా రూపొందించిన 15 యంత్రాలను ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌,

Published : 27 May 2022 03:27 IST

ఐఐసీటీ శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరణ


డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన యంత్రంతో ఐఐసీటీ శాస్త్రవేత్తలు

ఈనాడు- హైదరాబాద్‌: సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే ఏడబ్ల్యూజీ(అట్మాస్ఫియర్‌ వాటర్‌ జనరేటర్‌) యంత్రాలను తయారు చేశారు. ఇలా రూపొందించిన 15 యంత్రాలను ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌, రిషికేశ్‌, తెహ్రి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో గురువారం ఏర్పాటు చేశారు. వీటిలో 10 యంత్రాలు ఒక్కోటి రోజుకు 60 లీటర్ల చొప్పున, మరో ఐదు రోజుకు 150 లీటర్ల చొప్పున నీటిని ఉత్పత్తి చేస్తాయి. ఐఐసీటీ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌ ఆధ్వర్యంలోని బృందం వీటిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌కు చెందిన మైత్రీ ఆక్వాటెక్‌ సహకారంతో ఐఐసీటీ ఏడబ్ల్యూజీ యంత్రాలకు రూపకల్పన చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని