icon icon icon
icon icon icon

రాజధాని నగరంపై ‘కోటి’ ఆశలు

రాజధాని ఓట్లపై అని పార్టీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. ఈ నెలాఖరున జరగనున్న శాసనసభ ఎన్నికలకు అనుబంధ ఓటర్లతో తుది జాబితా సిద్ధమైంది.

Updated : 12 Nov 2023 10:36 IST

రాజధానిలో 1.12 కోట్లకు చేరిన ఓటర్లు
శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7.32 లక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని ఓట్లపై అని పార్టీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. ఈ నెలాఖరున జరగనున్న శాసనసభ ఎన్నికలకు అనుబంధ ఓటర్లతో తుది జాబితా సిద్ధమైంది. అందులో నగర ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై నాయకులందరూ దృష్టిసారించారు. రాజధాని పరిధి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గం కలిపి 29 స్థానాల్లో ఓటర్ల సంఖ్య 1.12కోట్లకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబరు 4న విడుదలైన తుది ఓటరు జాబితాతో పోల్చితే సుమారు 7లక్షల ఓటర్లు అనుబంధ జాబితాలోకి వచ్చారు. కొత్త ఓటర్ల దరఖాస్తుకు అక్టోబరు 31 వరకు ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వడంతో హైదరాబాద్‌ జిల్లాలో 1,79,379 మంది జాబితాలో చేరారు. 84,985 ఓట్లను జాబితాను రద్దు చేశారు.హైదరాబాద్‌, రంగారెడ్డి నియోజకవర్గాల వారీగా తాజా ఓటర్ల జాబితా ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img