icon icon icon
icon icon icon

కాకినాడ

కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది (Kakinada Lok Sabha constituency)  జనరల్‌ కేటగిరిలోనే ఉంది.

Updated : 28 Apr 2024 17:11 IST

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఏడు శాసనసభా నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం, కాకినాడ పట్టణం, జగ్గంపేట ఇలా అన్ని అసెంబ్లీ స్థానాలు జనరల్‌ కేటగిరిలోవే కావడం గమనార్హం.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం.. ఇక్కడ 15.99 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వారిలో  7.88 లక్షల మంది పురుషులు, 8.10 లక్షల మంది మహిళలు, 179 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌పై వైకాపాకి చెందిన వంగా గీతా విశ్వనాథ్‌ 25,738 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సునీల్‌కు 42.04 శాతం ఓట్లు రాగా.. గీత 44.16 శాతం ఓట్లు సాధించారు.

ప్రస్తుత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి మరోసారి చలమలశెట్టి సునీల్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు బరిలో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండల కేంద్రానికి చెందిన ఉదయ్‌ శ్రీనివాస్‌ ‘టీ టైం’ సంస్థ అధినేత. ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆయన సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేశారు. దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి స్వదేశానికి వచ్చారు. దేశీ టీ టైం స్టాల్స్‌ శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. 3,300 శాఖల వరకు ఉన్నాయి. ఇక వైకాపా కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌ నాలుగోసారి బరిలో దిగుతున్నారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.ఎం.పల్లంరాజు 2004, 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి, కేంద్ర మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది.

  • ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 1952 - చెలికాని. వెంకట రామారావు (సీపీఐ)
  • 1957 - బయ్య. సూర్యనారాయణ మూర్తి (కాంగ్రెస్‌)
  • 1962 - మొసలిగంటి. తిరుమల రావు (కాంగ్రెస్‌)
  • 1967 - మొసలిగంటి. తిరుమల రావు (కాంగ్రెస్‌)
  • 1971 - ఎం.ఎస్‌. సంజీవి రావు (కాంగ్రెస్‌)
  • 1977 - ఎం.ఎస్‌. సంజీవి రావు (కాంగ్రెస్‌)
  • 1980 - ఎం.ఎస్‌. సంజీవి రావు (కాంగ్రెస్‌)(ఐ)
  • 1984 - తోట. గోపాల కృష్ణ (తెదేపా)
  • 1989 - ఎం.ఎం. పల్లం రాజు (కాంగ్రెస్‌)
  • 1991 - తోట. సుబ్బారావు (తెదేపా)
  • 1996 - తోట. గోపాలకృష్ణ (తెదేపా)
  • 1998 - కృష్ణం రాజు (భాజపా)
  • 1999 - ముద్రగడ పద్మనాభం (తెదేపా)
  • 2004 - ఎం.ఎం. పల్లంరాజు (కాంగ్రెస్‌)
  • 2009 - ఎం.ఎం. పల్లంరాజు (కాంగ్రెస్‌)
  • 2014 - తోట. నరసింహం (తెదేపా)
  • 2019 - వంగా గీత (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img