icon icon icon
icon icon icon

హిందూపురం

హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది.

Published : 26 Apr 2024 14:41 IST

1952లో జరిగిన మొదటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో పెనుకొండ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండేది. ప్రజాపార్టీకి చెందిన కె.ఎస్.రాఘవాచారి తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957 నుంచి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంగా (Hindupur Lok Sabha constituency) రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది జనరల్‌ కేటగిరీలో ఉంది. 

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఈ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. హిందూపురం, మడకశిర (ఎస్సీ), పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. రాప్తాడు ఒక్కటే అనంతపురం జిల్లాలో ఉండగా, మిగిలిన నియోజకవర్గాలన్నీ శ్రీ సత్యసాయి జిల్లాలోనే ఉన్నాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం 16,41,717 ఓటర్లు ఉండగా, 8,20,254 పురుషులు.. 821387 మంది మహిళలు.. 76 టాన్స్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో పదిసార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, అయిదుసార్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై వైకాపా అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ విజయం సాధించారు.

ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పోటీ  చేస్తున్నారు. బీసీ (కురుబ) సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి అనంతపురం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా, హిందూపురం ఎంపీగా, రెండుసార్లు పెనుగొండ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజకీయ అనుభవం పార్థసారధికి ఉంది. మరోవైపు వైకాపా నుంచి వాల్మీకి (బోయ) సామాజిక వర్గానికి చెందిన జోళదరాశి శాంత పోటీలో ఉన్నారు. 2009-2014 మధ్య కాలంలో భాజపా తరపున బళ్లారి ఎంపీగా చేశారు. ఆమె సోదరుడు బి.శ్రీరాములు కర్ణాటక మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ నుంచి సమద్‌ షహీన్‌ పోటీలో ఉన్నారు.

  • గత లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే!
  • 1957: కె.వి.రామకృష్ణారెడ్డి (కాంగ్రెస్‌)
  • 1962: కె.వి.రామకృష్ణారెడ్డి (కాంగ్రెస్‌)
  • 1967: నీలం సంజీవరెడ్డి (కాంగ్రెస్‌)
  • 1971: పి.బాయపరెడ్డి (కాంగ్రెస్‌)
  • 1977: పి.బాయపరెడ్డి (కాంగ్రెస్‌)
  • 1980: పి.బాయపరెడ్డి (కాంగ్రెస్‌)
  • 1984: కె.రామచంద్రారెడ్డి (కాంగ్రెస్‌)
  • 1989: సానిపల్లి గంగాధర (కాంగ్రెస్‌)
  • 1991: సానిపల్లి గంగాధర (కాంగ్రెస్‌)
  • 1996: ఎస్.రామచంద్రారెడ్డి (తెదేపా)
  • 1998: సానిపల్లి గంగాధర (కాంగ్రెస్‌)
  • 1999: బి.కె.పార్థసారథి (తెదేపా)
  • 2004:  జి.నిజాముద్దీన్ (కాంగ్రెస్‌)
  • 2009: నిమ్మల కిష్టప్ప (తెదేపా)
  • 2014: నిమ్మల కిష్టప్ప (తెదేపా)
  • 2019: కురవ గోరంట్ల మాధవ్‌ (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img