logo

స్ట్రాంగ్‌ రూమ్‌లకు భారీ బందోబస్తు

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు.

Updated : 23 Apr 2024 05:24 IST

ఏర్పాట్ల పరిశీలనలో ఈఆర్‌ఓ హేమంత్‌, ఇతర అధికారులు, రాజకీయ నేతలు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. చాదర్‌ఘాట్‌ విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఉన్న ఈవీఎంలు నియోజకవర్గాల పరిధిలోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈవీఎంలు యూసుఫ్‌గూడలోని డీఆర్‌సీ సెంటర్‌ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియానికి చేరాయి. ఈ నియోజకవర్గంలో 245 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 306 బీయూలు, 306 సీయూలు, 343 వీవీ ప్యాట్లు విక్లరీ ప్లేగ్రౌండ్‌లో నియోజకవర్గ అధికారులకు స్థానిక పార్టీ ప్రతినిధుల సమక్షంలో అప్పగించారు. వారి సమక్షంలోనే ప్రత్యేక భద్రతఉన్న వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య ఇండోర్‌ స్టేడియంలోని డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షెన్‌ అండ్‌ కౌంటింగ్‌(డీఆర్‌సీ) సెంటర్‌కు చేరాయి. అక్కడ స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపర్చారు. అభ్యర్థుల తుది జాబితా ఆధారంగా చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. అనంతరం బ్యాలెట్‌ పత్రం తయారుచేసి ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఎన్నికలు నిర్వహణకు ఎంపికచేసిన ఉద్యోగులకు ఇప్పటికే శిక్షణ పూర్తయ్యింది. ఎన్నికల ముందు రోజు డీఆర్‌సీ కేంద్రాల్లో ఈవీఎంలు, సామగ్రిని ఎన్నికల అధికారులకు అప్పగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని