logo

క్యాన్సర్‌పై సమగ్ర పుస్తకం అభినందనీయం

క్యాన్సర్‌ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దిశగా పరిశోధనలు జరగాలని ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌ అన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీపీఎంబీ) డైరెక్టర్‌ డా.రామకృష్ణ

Published : 19 May 2024 03:26 IST

లాలాపేట, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దిశగా పరిశోధనలు జరగాలని ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌ అన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీపీఎంబీ) డైరెక్టర్‌ డా.రామకృష్ణ కంచ రచించిన ‘బయోమెడికల్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ సాలిడ్‌ క్యాన్సర్స్‌’  పుస్తకాన్ని రిజిస్టార్‌ ఆచార్య పి.లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్, రెనోవా సౌమ్య హాస్పిటల్, ఐసీఎంఆర్‌- ఎన్‌ఐఎన్, ఏఐజీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, అమోర్‌ హాస్పిటల్, కిమ్స్‌ వంటి సంస్థలు కలిసి క్యాన్సర్‌ కారకాలు, చికిత్స, సవాళ్లపై సమగ్ర పుస్తకాన్ని తీసుకురావటంపై హర్షం వ్యక్తం చేశారు. పుస్తక సంపాదకులు, సీపీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రామకృష్ణ కంచ మాట్లాడుతూ... హైదరాబాద్‌ మహానగరంలోని జీవ శాస్త్రవేత్తలు, వైద్యులు, పరిశోధక విద్యార్థుల నెట్‌ వర్కింగ్‌తో ఈ ప్రయత్నం చేశామని అన్నారు. జీవశాస్త్రవేత్తలు, వైద్యులకు వివిధ క్యాన్సర్‌లపై ప్రాథమిక, అధునాతన శాస్త్రీయ సమాచారాన్ని అందించడానికి పుస్తకం ఉపయోగపడుతుందని చెప్పారు. సీనియర్‌ అధ్యాపకులు, ఆంకాలజిస్టులు పాల్గొని పెరుగుతున్న క్యాన్సర్‌ భారాన్ని పరిష్కరించడానికి ఇలాంటి పుస్తకాలు అవసరమని అభిప్రాయపడ్డారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని