logo
Published : 02/12/2021 02:41 IST

కొత్త పథకం...నేతన్నకు అభయం

సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేలా ప్రణాళిక

90 శాతం రాయితీ అందించనున్న హెచ్‌ఎస్‌ఎస్‌

న్యూస్‌టుడే, జమ్మలమడుగు

జమ్మలమడుగు: మగ్గంపై వస్త్రం నేస్తున్న కార్మికురాలు

కరోనాతో పాటు భారీ వర్షాల కారణంగా చేనేత రంగం చితికి పోయింది. చీరలు అమ్ముడుపోని స్థితి ఒక వైపు, పెరిగిన ముడి సరకుల ధరలు మరో వైపు. వరుస వర్షాలతో మగ్గం గుంతల్లో నీళ్లు నిలిచి పనులు ఆగిపోయి నేతన్న పరిస్థితి అయోమయంగా మారింది. చేనేత కార్మికులకు ఆదుకుంటూ సాంకేతిక పరిజ్ఞానం అందించి ఉత్పాదకత పెంపొందించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రిత్వశాఖ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. హాత్‌కర్ఘ సంవర్ధన్‌ (హెచ్‌ఎస్‌ఎస్‌) అనే నూతన పథకం ద్వారా లబ్ధి పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గతంలో క్లస్టర్‌ పరిధిలో నిర్వహించే ఈ పథకాన్ని నేడు క్లస్టర్‌ బయట ఉన్న ఆసక్తి కలిగిన చేనేత కార్మికులకు అందించేందుకు సన్నాహాలు చేపట్టారు.

10 శాతం పెట్టుబడి 90 శాతం రాయితీ

వస్త్ర నాణ్యత, ఉత్పాదకత, కార్మికుల జీవన విధానాన్ని మెరుగు పరిచేందుకు అధునాతన మగ్గాలు, ఉపకరణాలు కొనుగోలు చేయడానికి కేంద్రం 90 శాతం రాయితీ అందించనుంది. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారికి, నైపుణ్య శిక్షణ తీసుకున్న కార్మికులకు ప్రాధాన్యం ఉంటుంది. పది శాతం పెట్టుబడి పెడితే సరిపోతుంది.

జమ్మలమడుగు ప్రాంతంలో తయారైన రంగు రంగు చీరలు​​​​​​​

దరఖాస్తు చేసుకోవడం ఇలా?

ఆధార్‌, నేత కార్మికుల గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు, జతచేసి చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు పది శాతం నగదు చెల్లిస్తే సరఫరాదారుడు ఉపకరణాలు అమర్చిన తర్వాత మొత్తం సహాయం నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.

కొత్త పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర జౌళిశాఖ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన కొత్త పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. క్లస్టర్లకు బయట ఉన్న కార్మికులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సర్వే నిమిత్తం క్షేత్రసహాయకులకు ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరిస్తున్నాం. - కృష్ణ, చేనేత జౌళిశాఖ, సహాయ సంచాలకులు, కడప

జిల్లాలో చేనేత కార్మికుల వివరాలు

నూలు వస్త్రాన్ని నేసే సంఘాలు : 118

పని చేసే కార్మికులు : 14,147

సిల్క్‌ వస్త్రాన్ని నేసే సంఘాలు : 72

అందులో పని చేసే నేతన్నలు : 6,239

చేనేత కుటుంబాలు : 14,281

చేనేతను నమ్ముకున్నవారు : 54,956

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని