logo
Published : 28/11/2021 00:54 IST

అక్కా తమ్ముళ్ల విషాదాంతం

తమ్ముడు నాగరాజు, అక్క భాగ్యశ్రీ

హావేరి, న్యూస్‌టుడే : అక్క మందలించిందనే బాధతో తమ్ముడు ఉరివేసుకోగా.. ఆ బాధను భరించలేక అక్క బలవన్మరణం పొందిన దుర్ఘటన హావేరి జిల్లా బ్యాడగి పట్టణంలోని వినాయక నగరలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. మృతులను నాగరాజు (16), భాగ్యశ్రీ (18)గా గుర్తించారు. వీరు స్థానిక భాజపా శాసనసభ్యుడు నెహ్రూ ఓలేకర్‌కు దూరపు బంధువులని గుర్తించారు. సరిగ్గా చదువు కోవడం లేదని ఇటీవల అక్క తన తమ్ముడిని మందలించడంతో నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడు మరణించాడనే బాధతో అక్క కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. బ్యాడగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని