logo

పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం

మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం

Updated : 23 Apr 2024 15:46 IST

ఇల్లందు గ్రామీణం: మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం పినపాక, ఇల్లందు భారాస నాయకులతో రేగా కాంతారావు మహబూబాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు గెలుస్తుందన్నారు. మహబూబాబాద్‌లో కవిత విజయం ఖాయం అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని