logo

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ గౌతమ్‌ హాజరయ్యారు.

Published : 19 May 2024 04:41 IST

ఖమ్మం నగరం: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ గౌతమ్‌ హాజరయ్యారు. జిల్లాలో 18,600 మంది అభ్యర్థుల కోసం 52 కేంద్రాలు సిద్ధం చేసినట్లు వివరించారు. లైజన్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించామన్నారు. అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, మధుసూదన్‌ నాయక్, డీఎంహెచ్‌ఓ మాలతి, ఆర్టీఓ ఆఫ్రిన్‌ సిద్దిఖీ, డీఈఓ సోమశేఖరశర్మ పాల్గొన్నారు.

ఎన్నికల విధులపై అవగాహన కల్పించాలి..

ఎమ్మెల్సీ ఉపఎన్నికల సిబ్బందికి విధులపై పూర్తి అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మాస్టర్‌ ట్రైనీలతో శనివారం సమావేశం నిర్వహించారు. బ్యాలెట్‌ జంబో బాక్స్, గోద్రేజ్‌ లార్జ్‌ బాక్స్‌లకు సీల్‌ చేసే పద్ధతిపై పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇవ్వాలని కొండపల్లి శ్రీరామ్, మదన్‌గోపాల్‌లకు సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని