logo

సీతారామ ప్రాజెక్టు కాలువను వేగంగా పూర్తి చేయాలి

సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగు, తాగునీటిని సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెం పాటి అప్పారావు అన్నారు.

Published : 19 May 2024 12:54 IST

కామేపల్లి: సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగు, తాగునీటిని సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెం పాటి అప్పారావు అన్నారు. కామేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఓట్ల కొరకు వచ్చే నాయకులను సీతారామ ప్రాజెక్టు ఏమైందని నిలదీయాలని ప్రజలకు సూచించారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఉమ్మడి జిల్లాకి వచ్చిన నిధులను సత్తుపల్లి ప్రాంత నాయకులు వారి ప్రాంతానికే కేటాయించుకున్నారు తప్ప గిరిజన ప్రాంతానికి ఏ ఒక్క ప్రాజెక్టును తీసుకురాలేదని మండిపడ్డారు. మన ప్రాంతానికి రావలసిన కాల్వలను కూడా గద్దల వలె తన్నుకు పోవాలని ప్రయత్నం చేస్తున్న వారి కుట్రలను రైతులందరూ ఐక్యమత్యంతో వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని