logo
Published : 01/12/2021 03:03 IST

‘వేధింపుల చట్టం నిర్వీర్యానికి యత్నం’

విస్సన్నపేట, న్యూస్‌టుడే: దళితులు, గిరిజనులు పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని నేటి పాలకులు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాది వీరయ్య మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్సన్నపేటలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విస్సన్నపేట మండలంలో సామాజిక కార్యకర్త బొట్ల శివ సత్యనారాయణ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నిస్తున్నారనే కారణంగా గ్రామ వాలంటీరుతో ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగించిన సంఘటనను ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో ఆయనతోపాటు తిరువూరు నియోజకవర్గ అధ్యక్షుడు మారబత్తుల గోపాల్‌, ఎ.కొండూరు మండల అధ్యక్షుడు కొర్లపాటి రత్నరావు, కె.నాగేశ్వరరావు, పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని