logo

బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ

అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి  ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్‌ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు.

Updated : 19 Apr 2024 06:38 IST

22 నుంచి బంజారాల జాతర
న్యూస్‌టుడే-మద్దూరు

డవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి  ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్‌ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో ప్రభు జన్మదినాన్ని(చైత్ర శుద్ధ పౌర్ణమి) పురస్కరించుకుని వేడుకలు చేస్తారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహరాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రభుకు నైవేద్యాన్ని సమర్పిస్తారు.

ఇక్కడే ఎందుకంటే....

16వ శతాబ్దంలో లక్ష్మీబాయి, రాంజీమహరాజ్‌ దంపతులకు ఛైత్రశుద్ధ పౌర్ణమి రోజున గురులోకమసంద్‌ ప్రభువు జన్మించారు. పదో సంవత్సరం నుంచి దేవాలయాలు తిరుగుతూ ఆత్మజ్ఞానం పొందారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం దర్శించుకుని, కఠోర నియమాలతో 12 ఏళ్లు గ్రంథ పఠనం చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ అడవుల్లో తిరిగారు. దేశసంచారం చేస్తూ తిమ్మారెడ్డిపల్లి చేరుకున్నారు. ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇక్కడే కాళికాదేవి ఆలయం నిర్మించుకుని 17వ శతాబ్దం మధ్యలో జీవసమాధి అయ్యారు. అప్పటి నుంచి బంజారాలు ఆయన జన్మదినాన్ని ఇక్కడ ఘనంగా జరుపుతారు.


ప్రత్యేక ఏర్పాట్లు..


 

త్సవాల సందర్భంగా మహబూబ్‌నగర్‌, నారాయణపేట, తాండూరు డిపోల నుంచి  ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది..ఈ బస్సులు కోస్గి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, మద్దూరు బస్టాండ్ల నుంచి తిమ్మారెడ్డిపల్లికి చేరుకుంటాయి. నారాయణపేట జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి, నిరంతర విద్యుత్తు, వైద్యసిబ్బంది నియామకం, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


ఉత్సవాలు ఇలా

ప్రిల్‌ 22 నుంచి నాలుగు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మొదటిరోజు జెండా అవిష్కరణ, ధ్వజారోహణం, రాత్రికి ప్రభోత్సవం, భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండోరోజు ఆవరణలోని ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, గిరిజన భక్తుల భజన కీర్తనలు, మూడోరోజు తెల్లవారుజామున రథోత్సవం, పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు తీర్థప్రసాదాల వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నాలుగోరోజు కాళికాదేవికి ప్రత్యేక పూజలు, పల్లకిసేవ, హోమం నిర్వహిస్తారు. అమ్మవారికి మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రంగురంగుల జెండాలను చేతబూని స్వామి సమాధి ముందు ప్రతిష్ఠాపన చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని