logo

సినీ నటుడు వెంకటేశ్‌ కుమార్తె ప్రచారం

సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌ కూతురు ఆశ్రిత బుధవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 02 May 2024 16:34 IST

ముస్తఫానగర్‌లో ప్రచారం చేస్తున్న ఆశ్రిత, స్వప్నిరెడ్డి, అర్జున్‌రెడ్డి తదితరులు

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత బుధవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూతురు స్వప్నిరెడ్డితో కలిసి ఖమ్మం నగరంలో ఇంటింటి ప్రచారం చేశారు. తమ మామ, లోక్‌సభ ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. పోలీసు హౌసింగ్‌ కాలనీలో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరై ఓట్లు అభ్యర్థించారు.  సాయంత్రం 55, కేకే అపార్ట్‌మెంట్స్‌, 23వ డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో రఘురాంరెడ్డి చిన్న కుమారుడు అర్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని