logo

జోరందుకున్న నామపత్రాల సమర్పణ

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది.

Published : 23 Apr 2024 04:01 IST

నాగర్‌కర్నూల్‌లో కలెక్టర్‌కు నామపత్రాన్ని అందజేస్తున్న భారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ , భాజపా అభ్యర్థి భరత్‌ప్రసాద్‌ ,
కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి తరఫున నామినేషన్‌ వేస్తున్న సతీమణి రాజబన్సీదేవి మల్లు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. సోమవారం మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ స్థానాల పరిధిలో మొత్తం 10 నామపత్రాలు దాఖలయ్యాయి. ఐదుగురు కొత్తగా నామపత్రాలు సమర్పించగా మిగతా ఐదుగురు మరో సెట్టు నామినేషన్‌ వేశారు. మహబూబ్‌నగర్‌లో విడుతలై చిరుతైగల్‌ కచ్చి పార్టీ నుంచి కె.శంకర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి కె.రామలింగప్ప నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సరోజనమ్మ పేరు మీద మరో సెట్టు నామపత్రాలు దాఖలయ్యాయి. నాగర్‌కర్నూల్‌ పరిధిలో భాజపా నుంచి ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి ప్రసంగి, అలయన్స్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ నుంచి అంబోజు రవి కొత్తగా నామపత్రాలు దాఖలు చేశారు. ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, పోతుగంటి భరత్‌, మల్లు రవిపై మరో సెట్‌ నామపత్రాలు దాఖలయ్యాయి. నాలుగు రోజుల్లో రెండు లోక్‌సభ స్థానాల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు వేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి మరో మూడు రోజులే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని