logo

అటు.. ఇటు ఓటేశారు!

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది.

Updated : 19 May 2024 04:01 IST

బారులు తీరిన ఓటర్లు 

న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌ టౌన్‌: ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఒకరికి ఒక్క ఓటు మాత్రమే ఇవ్వగా.. వీరికి మాత్రం ఎక్కడా లేని విధంగా రెండు రాష్ట్రాల్లోనూ హక్కు కలిగి ఉండటం గమనార్హం. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ఇదే ప్రస్ఫుటమైంది.సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద, కంగ్టి, న్యాల్‌కల్, మొగుడంపల్లి మండలాల్లోని ఏస్గి, ఔదత్‌పూర్, శిఖర్కాన, కరస్‌గుత్తి, కారాముంగి, ఇరక్‌పల్లి, గొందేగామ్, షాపూర్, గౌడ్‌గామ్‌జనవాడ, మావినేల్లి తదితర 40 గ్రామాలు తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతవాసులే కాకుండా కర్ణాటక రాష్ట్రం సరిహద్దు గ్రామాలకు చెందిన వారు సైతం ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటేయడం గమనార్హం. ఈ నెల 7న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటేయగా.. తిరిగి తెలంగాణలో 13న జరిగిన ఎన్నికల్లో మరోసారి ఓటేశారు. ఇలా ఆయా గ్రామాల్లో 75 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • నాగల్‌గిద్ద మండలం ఏస్గి గ్రామం కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ఇక్కడి వారు కర్ణాటకలోని బీదర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి అక్కడా ఓట్లు ఉన్నాయి. రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా 150 మంది ఓటేశారని స్థానిక నాయకుడొకరు తెలిపారు.ః నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గామ్‌జనవాడ గ్రామం కర్ణాటకకు ఆనుకొని ఉంటుంది. ఇక్కడివారంతా ప్రతి పనికి అక్కడికే వెళ్తుంటారు. ఈ గ్రామానికి చెందిన 100 మంది వరకు రెండు చోట్ల ఓటేశారని అంచనా.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని