AP News: వరద బీభత్సం.. నెల్లూరులో అర్ధరాత్రి హాహాకారాలు
కాలనీ వాసులను శిబిరాలకు తరలిస్తున్న సహాయక బృందం
నెల్లూరు(వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే : పెన్నానదిలో వరద ఉద్థృతి ఎక్కువగా ఉండటంతో నెల్లూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటక భగత్‌సింగ్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ దాదాపు 1300 గృహాల్లో ప్రజలు నివాసం ఉంటున్నారు. నిన్న ఉదయం నుంచి కొందరు స్థానికులను జనార్ధనరెడ్డి కాలనీలోని టిడ్కో గృహాలకు తరలించారు. అర్ధరాత్రి దాటాక వరద నీరు కాలనీని పూర్తిగా కమ్మేసింది. ఇళ్లలోకి నీరు రావడంతో పిల్లలు, పెద్దలు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. భయాందోళనతో నడుం లోతు నీళ్లలోనే పరుగులు తీశారు. టిడ్కో ఇళ్లను సైతం వరద ముంచెత్తింది. వీటిలో అప్పటి వరకు తలదాచుకున్న బాధితులు, భగత్‌సింగ్ కాలనీవాసులను నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలకు తరలించారు. మంత్రి అనిల్‌కుమార్ అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
భగత్‌సింగ్ కాలనీలోకి చేరిన నీరు
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి అనిల్
ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.