logo

రెండో రోజు ఎనిమిది నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు.

Published : 20 Apr 2024 04:48 IST

కలెక్టర్‌కు నామపత్రాలు సమర్పిస్తున్న నెల్లూరు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజు, ఇతర నాయకులు

నెల్లూరు(కలెక్టరేట్‌, జడ్పీ), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున విశ్రాంత ఐఏఎస్‌ కొప్పుల రాజు మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను కలెక్టరేట్‌లో నెల్లూరు పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఎం.హరినారాయణన్‌కు అందజేశారు. కావలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి తెదేపా అభ్యర్థిగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మూడుసెట్లు, దగుమాటి సంహిత రెండు సెట్లు, రాడికల్‌ పార్టీ అభ్యర్ధిగా సాల్మన్‌ రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్‌ అధికారి శీనానాయక్‌కు సమర్పించారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాడికల్‌ పార్టీ అభ్యర్థిగా బాల్‌కుమార్‌ ఎండ్లూరి నాలుగు సెట్ల నామపత్రాలను రిట్నరింగ్‌ అధికారి విద్యాధరికి అందించారు. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యుగ తులసి పార్టీ అభ్యర్థి నెల్లూరు కృష్ణారెడ్డి రెండో సెట్‌ నామినేషన్‌ రిటర్నింగ్‌ అధికారి మధులతకు అందజేశారు. నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సోషల్‌ డెమోక్రటికల్‌ పార్టీ నుంచి ఫాజిల్‌ సయ్యద్‌ ఒక సెట్‌ నామినేషన్‌ రిటర్నింగ్‌ అధికారి మాలోలకు అందజేశారు.

అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజు ర్యాలీలో మాట్లాడుతూ జిల్లా ప్రజలపై నమ్మకంతో ఇక్కడ పోటీ చేయడానికి వచ్చానని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని