logo

అతి తక్కువ వడ్డీకే రిటెయిల్‌ రుణాలు

తక్కువ వడ్డీకే రిటెయిల్‌ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ రాజశేఖర్‌ పేర్కొన్నారు.

Published : 19 May 2024 03:53 IST

రిటెయిల్‌ ఎక్స్‌ పో రీజనల్‌ కార్యాలయం ప్రారంభిస్తున్న యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ రాజశేఖర్‌ 

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట):  తక్కువ వడ్డీకే రిటెయిల్‌ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ రాజశేఖర్‌ పేర్కొన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ కార్యాలయం ఆధ్వర్యంలో నగరంలోని అన్నమయ్య సర్కిల్‌లోని ఆ బ్యాంక్‌ శాఖ ఆవరణంలో శనివారం రిటెయిల్‌ ఎక్స్‌ పో కార్యక్రమం జరిగింది. వివిధ రకాలైన కారు మోడళ్ల ప్రదర్శనతోపాటు అర్హులైన ఖాతాదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. గృహ, కారు, విద్యా రుణాలు విరివిరిగా అందిస్తున్నామన్నారు. డిప్యూటీ రీజనల్‌ హెడ్‌ శివశంకర్, ఆర్‌ఎల్పీ హెడ్‌ సురేష్, అన్నమయ్య సర్కిల్‌ బ్రాంచ్‌ హెడ్‌ శ్రీనివాసులురెడ్డి, స్థానిక బ్రాంచి మేనేజర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని