logo

ఘనంగా హనుమాన్ విజయయాత్ర

ఎల్లారెడ్డి పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Published : 23 Apr 2024 21:09 IST

ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సాతెల్లి బేస్ పప్పు హనుమాన్ ఆలయంలో వైభవంగా వేడుకలు జరిగాయి. స్వామి వారికి ఉదయం విశేష అభిషేక పూజలు, యజ్ఞాలను నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు, యువకులు పట్టణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని