గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Updated : 04 May 2024 07:34 IST

అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు
వడదెబ్బతో రాయలసీమలో నలుగురి మృతి

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బతో రాయలసీమలో శుక్రవారం నలుగురు వృద్ధులు మృతి చెందారు. 63 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వడగాలులు వీచాయి. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్‌, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, విజయనగరం, వైఎస్సార్‌ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3, వైఎస్సార్‌ జిల్లా చిన్నచెప్పలిలో 47.2, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 47.1, తిరుపతి జిల్లా పెద్దకన్నాలిలో 46.9, కర్నూలు జిల్లా పంచలింగాలలో 46.8, చిత్తూరు జిల్లా తవణంపల్లె, పల్నాడు జిల్లా రావిపాడులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని