logo

ముగ్గురూ.. గతంలో పోటీ చేసిన వారే

ప్రస్తుతం జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన అనుభవం ఉంది.

Published : 29 Apr 2024 04:41 IST

ప్రస్తుతం జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ 2009, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. భారాస తరఫున బరిలో ఉన్న గాలి అనిల్‌కుమార్‌ 2019 ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభకు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్న బీబీపాటిల్‌ 2014, 2019 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు మూడోసారి పోటీలో ఉండగా.. భారాస అభ్యర్థి రెండోసారి బరిలో దిగారు. ఈ సారి ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 న్యూస్‌టుడే, బాన్సువాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు