logo

కార్మిక బంధువు నవీన్‌: పాండ్యన్‌

అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బంధువయ్యారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్‌ చెప్పారు.

Published : 23 Apr 2024 02:44 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బంధువయ్యారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్‌ చెప్పారు. ఆదివారం సాయంత్రం బుర్లా (సంబల్‌పూర్‌)లో బిజద శ్రామిక సంఘటన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాండ్యన్‌ మాట్లాడుతూ నవీన్‌ హయంలో జరిగిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. బిజు స్వాస్థ కళ్యాణ యోజనా (బీఎస్‌కేవై) పేదల వైద్యానికి ‘సంజీవని’ అయిందన్నారు. 2036 నాటికి స్వతంత్ర ఒడిశా వందేళ్ల వేడుకలు జరుపుకోనుండగా, ఈ వ్యవధిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది సీఎం ఆశయమని, దీన్ని నెరవేర్చడానికి అంతా సహకరించాలన్నారు. కార్యక్రమంలో బిజు శ్రామిక సంఘటన కార్యదర్శి, కటక నగర మేయరు సుభాష్‌సింగ్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని