logo

రాష్ట్రానికి మోదీ, రాజ్‌నాథ్, అమిత్‌షాల రాక

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్‌ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.

Published : 19 May 2024 01:11 IST

 నేడు, రేపు, ఎల్లుండి ప్రచార సభలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్‌ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. రాత్రి రాజ్‌భవన్‌లో విడిది చేయనున్న ఆయన సోమవారం ఉదయం 8 గంటలకు పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. తర్వాత బొడొదండోలో రోడ్‌షో నిర్వహించనున్న మోదీ అనంతరం 10 గంటలకు కటక్, 11.30 గంటలకు అనుగుల్‌లలో ఏర్పాటయ్యే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ఉదయం భువనేశ్వర్‌ చేరుకుంటారు. రెఢాఖోల్‌ (సంబల్‌పూర్‌), పాట్నా (కేంఝర్‌), ఖుర్దాల్లో ఏర్పాటయ్యే భాజపా విజయసంకల్ప ఎన్నికల బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 21న (మంగళవారం) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉదయం భువనేశ్వర్‌ చేరుకుంటారు. సంబల్‌పూర్, పరజంగి (ఢెంకనాల్‌), కేంఝర్, నయాగఢ్‌లలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారని భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్‌మహాపాత్ర్‌ శనివారం భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని