logo

మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌

జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్‌నాయుడు ప్రకటించారు.

Published : 29 Apr 2024 05:39 IST

జవాన్‌ డిక్లరేషన్‌ ప్రతులను విడుదల చేస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్‌నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం నగరంలోని మాజీ సైనికుల సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ‘ఎర్రన్న జవాన్‌ మిత్ర - జవాన్‌ డిక్లరేషన్‌’ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమరులైన, దివ్యాంగులైన సైనిక కుటుంబాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జవాన్లకు కేటాయించిన రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఉద్యోగ విరమణ చేసిన సైనికులకు ఆదాయం కల్పించేలా ప్రత్యేక జాబ్‌ మేళా ఏర్పాటు చేయడంతో పాటు ఆర్మీలో ఆఫీసర్‌ ర్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు, మాజీ సైనికోద్యోగుల సంఘ నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని