logo

కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి

పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది.

Published : 24 Apr 2024 00:03 IST

పొరుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ రోజు వర్తింపు
అన్ని సంస్థలకు ప్రజా సంబంధాలశాఖ ఆదేశం

సైదాపేట, న్యూస్‌టుడే: పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. అలా సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి సంబంధించి మంగళవారం తమిళనాడు శాఖ విడుదల చేసిన ప్రకటనలో... కేరళలో ఈ నెల 26న, ఆంధ్రాలో మే 13న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు, కర్ణాటకలో ఈ నెల 26న, మే 7న రెండు విడుతలుగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొంది. తమిళనాడులోని పలు రంగాలకు చెందిన ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే ఆంధ్రా, కర్ణాటక, కేరళకు చెందిన రోజువారీ కూలీలు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితర అన్ని రకాల సిబ్బందికి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద వారి సొంత రాష్ట్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తెలిపింది. లేని పక్షంలో సంబంధిత సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు