logo

వైభవంగా వాసవి జయంతి మహోత్సవం

జార్జిటౌన్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్‌కేపీడీ)లో శనివారం నిర్వహించిన శ్రీ వాసవి జయంతి (వైశాఖ, శుక్ల, దశమి) మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తి, ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు.

Updated : 19 May 2024 05:46 IST

 

శ్రీ వాసవి జ్యోతితో పాలక మండలి సభ్యులు

ప్యారిస్, న్యూస్‌టుడే: జార్జిటౌన్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్‌కేపీడీ)లో శనివారం నిర్వహించిన శ్రీ వాసవి జయంతి (వైశాఖ, శుక్ల, దశమి) మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తి, ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్‌కుమార్, దేసు లక్ష్మీనారాయణ, ఎస్‌ఎల్‌ సుదర్శనం, టీవీ రామకుమార్, సీఆర్‌ కిషోర్‌బాబు, టీఎస్‌ బద్రీనాథ్‌లు శ్రీ వాసవాంబ జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, పశ్చిమ గోదావారి జిల్లా పెనుగొండ నుంచి శ్రీ వాసవి జ్యోతిని నగరానికి తెప్పించారు. ఎస్‌కేపీడీ యాజమాన్యంలో చెట్‌పేట్ లోని  విద్యార్థి వసతి గృహం నుంచి శ్రీ వాసవి జ్యోతిని పాలకమండలి సభ్యులు ఊరేగింపుగా తీసుకురాగా గోవిందప్ప నాయక్‌ వీధిలోని ఎస్‌కేపీడీ బాలుర మహోన్నత పాఠశాల నుంచి పల్లకీలో అమ్మవారి చిత్రపటాన్ని కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. దాదాపు వెయ్యి మంది మహిళలు పాల బిందెలతో ఊరేగింపులో పాల్గొన్నారు. నగరంలోని వివిధ వైశ్య ధర్మ సంస్థల నిర్వాహకులతో పాటు పాలకమండలి మాజీ సభ్యులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపులో పాల్గొన్న వారికి దాతలు మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. మహిళలు తీసుకొచ్చిన పాలబిందెలతో అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసి అన్నదానం చేశారు. కార్యదర్శి ఎం కిషోర్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 102 మంది గాయనీ గాయకులతో కూడిన రాగమాలిక బృందం అమ్మవారికి సంగీతాంజలి సమర్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు