Published : 01 Dec 2021 06:09 IST
పోలీసులే కూలీలు
రామభద్రపురంలోని జాతీయ రహదారిపై మంగళవారం పోలీసు సిబ్బంది శ్రమదానం చేసి, పలుచోట్ల గుంతలను పూడ్చారు. కంకర, రాళ్లు వేసి యంత్రాలతో చదును చేశారు. దీంతో అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు. ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశాల మేరకు కొన్నిచోట్ల ఇలా చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణమూర్తి, విజయనగరం ఆర్ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. - న్యూస్టుడే, రామభద్రపురం
Tags :