logo

ఉప్పొంగిన అభిమానం

రాజాం పట్టణం జనసంద్రమైంది. కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ నామినేషన్‌ సందర్భంగా మండుటెండను సైతం లెక్క చేయకుండా వివిధ మండలాల నుంచి చేరుకున్న వేలాది మంది గంటల కొద్దీ ర్యాలీలో పాల్గొన్నారు.

Published : 20 Apr 2024 03:46 IST

గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్‌తోపాటు ర్యాలీగా వెళ్తున్న నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు

న్యూస్‌టుడే, రాజాం, సంతకవిటి, వంగర,  చీపురుపల్లి, గజపతినగరం, బొండపల్లి: రాజాం పట్టణం జనసంద్రమైంది. కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ నామినేషన్‌ సందర్భంగా మండుటెండను సైతం లెక్క చేయకుండా వివిధ మండలాల నుంచి చేరుకున్న వేలాది మంది గంటల కొద్దీ ర్యాలీలో పాల్గొన్నారు. గజపతినగరంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ నామపత్రాలు వేసేందుకు పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ, ఊరేగింపుతో వెళ్లారు. నియోజకవర్గం నలుమూలల నుంచి 12వేల మందికి పైలుకు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

గజపతినగరంలో స్వతంత్ర అభ్యర్థిగా లెంక సూర్యారావు ఆర్వో సూర్యకళకు నామపత్రాలు అందించారు. అదేవిధంగా  గజపతినగరంలో కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌తోపాటు ఆయన సతీమణి కొండపల్లి లక్ష్మీసింధు మరో సెట్‌ సమర్పించారు.  మాజీ మంత్రి పడాల అరుణ, కొండపల్లి కొండలరావు, భాజపా నేత దేవర ఈశ్వరరావు పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థి బొత్స అప్పలనరసయ్యతోపాటు ఆయన సతీమణి దేవీ అనురాధ మరో సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

చీపురుపల్లిలో నామినేషన్‌ అనంతరం మూడు రహదారుల కూడలిలో ఏర్పాటు చేసిన సభలో  నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ ఎస్వీ రమణరాజు, మంత్రి తనయుడు బొత్స సందీప్‌, నాలుగు మండలాల వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఆపై చీపురుపల్లిలోని పిల్లపేటలో బొత్స ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు