logo

ఆగడంలేదు... ఆపడంలేదు!

మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.

Published : 19 May 2024 01:49 IST

మదనపల్లెలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు

బాహుదా వంకలో ఇసుక తవ్వకాలు

న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ : మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు. బహిరంగంగా తవ్వకాలు నిర్వహిస్తున్నా రెవెన్యూ, జలవనరులు, గనులశాఖల అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనూ ఇసుక తవ్వకాలు, రవాణా కొనసాగుతుండడం గమనార్హం. మదనపల్లె మండలం చిప్పిలి వేసవి జలాశయం సమీపంలోని బాహుదా నదిలో జేసీబీలతో ఇసుక తవ్వకాలు జరుపుతూ టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేంపల్లె పంచాయతీ పరిధిలోని హంద్రీ-నీవా కాలువ కింద, గుట్టకిందపల్లె వద్ద చెరువులతోపాటు వేంపల్లె చెరువుల్లో ఇసుకను ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకను రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకను చెరువుల వద్ద, కొండమర్రిపల్లె బైపాసు రోడ్డు, పుంగనూరు రోడ్డు, కదిరి రోడ్డు, బసినికొండ, కొత్తిండ్లు, నక్కలదిన్నె, ఎస్‌బీఐ కాలనీ శివారులలో నిల్వ చేస్తూ రాత్రివేళల్లో యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు